Tuesday, March 24, 2009

పరిచయం (Introduction)

తెలుగు లో మల్టీమీడియా కు సంభంధించిన పాఠాలు అందించడం కోసం ఈ బ్లాగు ప్రారంభించాను. ఈ బ్లాగు ని మా గురువు గారైన శ్రీ సజ్జా జయదేవ్ బాబు గారి వీడియో తో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో ని నేను నా పరివారం తో చెన్నై లో ఉన్న వారి గృహము ని సంధర్సించిన సంధర్భం లో తీసినది. మార్చి 2009 లో దీనిని యూట్యుబ్ (youtube) కి అప్‌లోడ్ చేశాను. మా గురువు గారు మా కుమార్తె సంతకాన్ని ఓ వ్యంగ్య చిత్రం గా గీయడం మా అందర్నీ అబ్బురపరిచింది. అతనో గొప్ప వ్యంగ్య చిత్రకారులు. నా బాల్యం నుండి నేను అతని అభిమానిని. వివిధ పత్రికల లో ప్రచురించిన అతని కార్తున్లని చూసి సాధన తో కార్తున్లని గీయడం నేర్చుకున్నాను. అతని సారధ్యం లో నిర్వహించిన ఆనిమేషన్ కోర్స్ లో విధ్యార్ధినై నై ఎన్నో మెళకువల ని అవగాహన చేసుకున్నాను. ఈ చలన చిత్రం, బ్లాగు వీక్షిస్తున్నవారిని అలరించగలదని ఆశిస్తున్నాను.



ఒకనొకప్పుదు "స్వాతి" సచిత్ర వారపత్రికలో " సంతకాలతో సరదాలు" అన్న శీర్క్షిక క్రింద జయదేవ్ బాబు గారు గీసిన కొన్ని వందల చిత్రాలు ప్రచురించబడ్డాయి. ఈ శీర్షిక చాలా ప్రాచుర్యము కూడా పొందిందీ.

శ్రీ జయదేవ్ బాబు గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ దిగువున తెలియజేసిన వెబ్‌సైట్ లను సందర్శించగలరు.
జయదేవ్ బ్లాగ్
సైలెంట్ కార్టూన్

వీడియో చూసినాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ధన్యవాదములు.