Sunday, April 5, 2009

పక్షి యానిమేషన్ టుటోరియల్

Thursday, March 26, 2009

2D ట్రైనింగ్ ప్రాజెక్ట్



2D ఆనిమేషన్ గురించి తెలియక మునుపు తెలుసుకోవాలనే ఆత్రుత చాల ఉండేది. శ్రీ జయదేవ్ బాబు గారు నన్ను 2D ఆనిమేషన్ నేర్చుకోమని ఎంతగానో ప్రోత్సాహించారు. కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కి అతనే ఫ్యాకల్టీ గా ఉండడం నిజంగానే నా భాగ్యం ఆనుకోవాలి. 2002 సంవత్సరం లో కలర్ చిప్స్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ లో ఆనిమేషన్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని, ఓ రెండేళ్ళు ఆ సంస్థ లోనే సిండికేషన్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసాను. ఈ ఆరేళ్ళ లో సాధన తో 2డి ఆనిమేషన్ లో ఎన్నో కొత్త విషయాలని నేర్చుకున్నాను.


పై వీడియో లోని క్లిప్స్ నేను ట్రైనింగ్ ఫైనల్ టెస్ట్ లో పూర్తి చేసిన ప్రాజెక్ట్ లో నుంచి సంగ్రహించినవి. వీడియో చూసినాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

Wednesday, March 25, 2009

వెబ్ డిసైనింగ్ (Web Desining)

ఇంటర్నెట్ గురించి అంతగా ఆవగాహన లేని కొందరు మిత్రులు చాల సార్లు నన్ను HTML అంటే ఏమిటని అడగడం జరిగింది.

HTML గురించి నాకు తెలిసినది ఎక్కడ పొందుపరుస్తున్నాను. HTML తో పాటే వెబ్ డిసైనింగ్ ఆంటే ఏమిటో కూడా తెలుసుకోవడం ముఖ్యం.

వెబ్ బ్రౌసర్స్ సహాయం తో మనం వెబ్ పేజస్ ని చూస్తాం. ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైయర్ ఫాక్స్ ఇంకా మరికొన్ని ఇతర కంపనీల వెబ్ బ్రౌసర్స్ సహాయం తో వెబ్ పేజస్ ని చూడవచ్చును. ఈ వెబ్ బ్రౌసర్స్ అన్ని ఓ ప్రత్యేకమైన భాషని మాత్రమే అర్థం చేసుకోగలవు. ఆ భాషనే HTML అని వ్యవహరిస్తారు. HTML పూర్తి అర్థం హైపర్ టెక్స్ట్ మార్కప్ ల్యాంగ్వేజ్ (Hyper Text Markup Language). ఇంటెర్నెట్ లో సౌలభ్యమయ్యే ట్యూటోరియల్ ద్వారా HTML భాషని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. Google సెర్చ్ లో "HTML Tutorial" అనే ముఖ్య పదాలని (Keywords) టైప్ చేసి సర్చ్ చేయండి. పుంఖానుపంఖాలుగా సర్చ్ రిసల్ట్స్ లో ట్యూటోరియల్ వెబ్ సైట్స్ కనిపిస్తాయి. శ్రద్దగా ఈ ట్యూటోరియల్స్ ని చదివి అర్థం చేసుకోగలిగితే ఓ వారం రోజులలో HTML ల్యాంగ్వేజ్ ని నేర్చుకోవచ్చు. HTML ల్యాంగ్వేజ్ లొ ప్రోగ్రంమింగ్ సమస్యల లాంటివి ఎమివుండవు గనుక ఈ లాంగ్వేజ్ ని చాల సులభము గా అర్ధం చేసుకోవచ్చు. HTML ఫైల్స్ ని .html ఫైల్ ఎక్స్‌టెన్షన్ తో సేవ్ చేసి వెబ్ సర్వర్స్ కి అప్‌లోడ్ చేస్తారు.
సాదారణ HTML పేజ్ ఈ దిగువ తెలియజేషీన కోడ్ కలిగివుటుంది.




పై కోడ్ ని ఎలా ఉన్నది అలా నోట్ ప్యాడ్ లో టైప్ చేసి ఆ నోట్ ప్యాడ్ ని sample.html పేరు తో డెస్క్‌టాప్ మీద సేవ్ చేసి వెబ్ బ్రౌసర్ (ఇంటెర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లేదా మోక్షిల్లా ఫైయర్ ఫాక్స్.) లో
ఓపెన్ చేయండి.

The quick brown fox jumps over the lazy dog.

గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ సహాయముతో వెబ్ పేజస్ అందంగా అలంకరిస్తారు. HTML పేజస్ లో గ్రాఫిక్స్ ని పొందుపరిచి వెబ్ పేజస్ ని అందముగా తీర్చి దిద్దుతారు.

గ్రాఫిక్ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పుకుంటే మనం ప్రప్రధముగా వినే పేరు ఫొటోషాప్ (Photoshop).ప్రపంచవ్యాప్తంగా చాలామంది గ్రాఫిక్ ఆర్టిస్ట్‌లు ఫొటోషాప్ ని ఎక్కువ గా ఇస్టపడతారు. రాబోయే పోస్ట్స్ లో ఫొటోషాప్ పవర్ ఎంతటిదో సంభాషిస్తాను.

Tuesday, March 24, 2009

పరిచయం (Introduction)

తెలుగు లో మల్టీమీడియా కు సంభంధించిన పాఠాలు అందించడం కోసం ఈ బ్లాగు ప్రారంభించాను. ఈ బ్లాగు ని మా గురువు గారైన శ్రీ సజ్జా జయదేవ్ బాబు గారి వీడియో తో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో ని నేను నా పరివారం తో చెన్నై లో ఉన్న వారి గృహము ని సంధర్సించిన సంధర్భం లో తీసినది. మార్చి 2009 లో దీనిని యూట్యుబ్ (youtube) కి అప్‌లోడ్ చేశాను. మా గురువు గారు మా కుమార్తె సంతకాన్ని ఓ వ్యంగ్య చిత్రం గా గీయడం మా అందర్నీ అబ్బురపరిచింది. అతనో గొప్ప వ్యంగ్య చిత్రకారులు. నా బాల్యం నుండి నేను అతని అభిమానిని. వివిధ పత్రికల లో ప్రచురించిన అతని కార్తున్లని చూసి సాధన తో కార్తున్లని గీయడం నేర్చుకున్నాను. అతని సారధ్యం లో నిర్వహించిన ఆనిమేషన్ కోర్స్ లో విధ్యార్ధినై నై ఎన్నో మెళకువల ని అవగాహన చేసుకున్నాను. ఈ చలన చిత్రం, బ్లాగు వీక్షిస్తున్నవారిని అలరించగలదని ఆశిస్తున్నాను.



ఒకనొకప్పుదు "స్వాతి" సచిత్ర వారపత్రికలో " సంతకాలతో సరదాలు" అన్న శీర్క్షిక క్రింద జయదేవ్ బాబు గారు గీసిన కొన్ని వందల చిత్రాలు ప్రచురించబడ్డాయి. ఈ శీర్షిక చాలా ప్రాచుర్యము కూడా పొందిందీ.

శ్రీ జయదేవ్ బాబు గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ దిగువున తెలియజేసిన వెబ్‌సైట్ లను సందర్శించగలరు.
జయదేవ్ బ్లాగ్
సైలెంట్ కార్టూన్

వీడియో చూసినాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ధన్యవాదములు.